|
|
byసూర్య | Fri, Oct 10, 2025, 10:52 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోతో పాటు ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్లు వేసిన వేలాది మంది అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికల ప్రచారం ఆగిపోయింది. అభ్యర్థుల ఖర్చులు వృథా అయ్యే అవకాశం ఉంది. హైకోర్టు తుది తీర్పు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపనుంది.