|
|
byసూర్య | Fri, Oct 10, 2025, 10:14 AM
TG: హైదరాబాద్ నగర శివారులో భారీ మొసలి సంచారం కలకలం రేపింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతి పేట్‌లో 12 అడుగుల మొసలి కనిపించడంతో గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారు. వారు వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వడంతో.. అధికారులు మొసలిని బంధించి జూపార్క్‌కు తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.