|
|
byసూర్య | Thu, Oct 09, 2025, 10:18 PM
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న MPTC, ZPTC ఎన్నికల సంబంధించి గెజిట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.సెప్టెంబర్ 29న విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.హైకోర్టు ఆదేశాలు అందిన వెంటనే, ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ కమిషన్ ప్రత్యేక గెజిట్‌ను విడుదల చేయనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కూడా తాత్కాలికంగా రద్దు చేయనున్నారు.ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలా లేదా అన్నది, హైకోర్టు తుది ఆదేశాలపై ఆధారపడి ఉంటుందని, తదుపరి నిర్ణయం కోర్టు తీర్పు అనంతరం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.ఈ పరిణామాలతో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా నడుస్తున్న ఎన్నికల హడావుడికి కొంత విరామం లభించినట్లయ్యింది.