|
|
byసూర్య | Mon, Oct 06, 2025, 12:48 PM
సోమవారం, మున్సిపల్ వార్డు నెంబర్ 14 పరిధిలోని సోఫీ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలపై యువ నాయకులు పొన్నం రాహుల్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. కాలనీలో కొన్ని నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదని, అంతర్గత రోడ్లపై పిచ్చి మొక్కలు మొలిచి ఇబ్బంది కలిగిస్తున్నాయని, చెత్తను ఎత్తే వారు లేక రోడ్లన్నీ చెత్తమయం అయ్యాయని, ప్రార్థన స్థలాల వద్ద సైతం చెత్త పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తుందని, అలాగే ఓ ప్రైవేటు వ్యక్తి ఏర్పాటు చేసుకున్న తోళ్ళ గోదాం వలన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన పేర్కొన్నారు.