ట్రాప్ హౌస్ పార్టీ పేరుతో ఫామ్ హౌసులో 50 మంది మైనర్ల మత్తు పార్టీ..

byసూర్య | Mon, Oct 06, 2025, 12:36 PM

"ట్రాప్ హౌస్ పార్టీ" పేరుతో ఫామ్ హౌసులో 50 మంది మైనర్ల మత్తు పార్టీ. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం..ఇద్దరు గంజాయి తీసుకున్నట్టు నిర్ధారణ. హైదరాబాద్ – మొయినాబాద్ ప్రాంతంలోని ఓక్స్ ఫామ్ హౌసులో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని అనుమానంతో దాడి చేసిన రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు. ఫామ్ హౌసుకు వెళ్లి చూడగా 50 మంది మైనర్లు ఉన్నట్టు గుర్తించి, 6 నిర్వాహకులు, 9 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎస్‌వోటీ అధికారులు. అక్కడున్న వారికి రక్త పరీక్షలు చేయగా, ఇద్దరు మైనర్లు గంజాయి సేవించినట్టు నిర్ధారణ. "ట్రాప్ హౌస్. 9MM" అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నిర్వహిస్తూ, ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నామని ప్రకటనలు విడుదల చేసిన హైదరాబాద్ నగరానికి చెందిన ఒక డీజే. శనివారం సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ పార్టీ ఉంటుందని, మీరు జీవితంలో ఎన్నడూ చూడని ఆనందం పొందుతారని ప్రకటనలు విడుదల. సింగిల్‌గా వస్తే రూ.1600, జంటగా వస్తే రూ.2800 అంటూ ఎంట్రీ పాస్ ధరలు వెల్లడి. దీంతో 50 మంది మైనర్లు మొయినాబాద్ పార్టీకి చేరుకుని, మత్తులో మునిగి తేలుతుండగా దాడి చేసి వారిని పోలీస్ స్టేషన్లో అప్పగించిన ఎస్‌వోటీ అధికారులు. కేసు నమోదు చేసి, మైనర్ల కుటుంబాలకు సమాచారమిచ్చిన పోలీసులు


Latest News
 

రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. వచ్చే వారం రోజులు జాగ్రత్త! Wed, Nov 12, 2025, 07:49 PM
సచివాలయంలో భారీగా అధికారుల బదిలీలు Wed, Nov 12, 2025, 07:48 PM
NIT వరంగల్‌లో రంగులు మెరిసే ఉద్యోగ అవకాశాలు..మూడు పోస్టులకు దరఖాస్తులు ఓపెన్! Wed, Nov 12, 2025, 07:47 PM
సంధ్యా కన్వెన్సషన్ హాల్ యజమానికి హైకోర్టులో చుక్కెదురు Wed, Nov 12, 2025, 07:41 PM
హైటెక్ సిటీకి త్వరలో మోనోరైళ్లు..!త్వరలో ప్రభుత్వం తుది నిర్ణయం Wed, Nov 12, 2025, 07:37 PM