|
|
byసూర్య | Mon, Oct 06, 2025, 11:43 AM
తెలంగాణలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో నేడు కూడా పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో రాత్రంతా వర్షాలు కురిసే అవకాశం ఉందని, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.