సుప్రీం కోర్టులో రేవంత్ రెడ్డికి ఊరట

byసూర్య | Mon, Sep 08, 2025, 01:41 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై రాష్ట్ర‌ బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. రాజకీయపరమైన అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.గత ఎన్నికల ప్రచార సమయంలో  కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ తెలంగాణ బీజేపీ ఆయనపై పరువు నష్టం దావా వేసింది. తొలుత ఈ కేసును తెలంగాణ హైకోర్టులో దాఖలు చేయగా, విచారణ అనంతరం న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, రాజకీయ నాయకులు చేసే ఆరోపణలు, విమర్శలకు సంబంధించిన వివాదాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి పూర్తిస్థాయిలో ఉపశమనం లభించినట్లయింది.


Latest News
 

రేపు ప్రధాని సభకు 2 వేల మందితో భద్రత: సీపీ సుమతి Sat, May 09, 2026, 05:51 PM
హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చాలి: సీఎం రేవంత్ రెడ్డి Sat, May 09, 2026, 05:50 PM
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ Sat, May 09, 2026, 04:27 PM
అన్‌ లోడింగ్‌ను రెట్టింపు వేగంతో పూర్తి చేయాలి: కలెక్టర్ Sat, May 09, 2026, 04:26 PM
మైనారిటీలకు గుడ్‌న్యూస్‌.. స్కిల్ డెవలప్‌మెంట్ డిగ్రీ కళాశాలల ఏర్పాటు Fri, May 08, 2026, 09:58 PM