అమ్మాయి విషయంలో స్నేహితుల మధ్య గొడవ.. ఓ యువకుడు మృతి

byసూర్య | Wed, Jun 18, 2025, 02:09 PM

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ అమ్మాయి విషయంలో స్నేహితుల మధ్య తలెత్తిన చిన్న పాటి గొడవ నేపథ్యంలో స్నేహితులు దాడి చేయడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే అమ్రేష్ ( 28) శామీర్ పేట్ లో ఒక పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు. ఓ అమ్మాయి విషయంలో స్నేహితుల మధ్య గత కొంత కాలంగా వివాదం కొనసాగుతుంది.మంగళవారం రాత్రి సమయంలో కళ్లు తాగేందుకు గాను నలుగురు స్నేహితులు కలిసి చందానగర్ లోని గిడ్డంగి కల్లు కాంపౌండ్ కు వచ్చారు. మహిళ విషయంలో స్నేహితుల మధ్య మరోసారి వివాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన మిత్రులు అమ్రేష్ పై పిడిగుద్దులు గుద్దడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 


Latest News
 

హైవేపై భారీ దోపిడీ.. రూ.10 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీ Sat, Jul 12, 2025, 11:25 AM
హైడ్రా నమ్మకాన్ని కోల్పోయింది: MP విశ్వేశ్వర్‌రెడ్డి Sat, Jul 12, 2025, 11:01 AM
కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మహేష్ కుమార్ గౌడ్ Sat, Jul 12, 2025, 10:17 AM
మంచి ఉద్యోగం రావడంలేదని యువకుడు ఆత్మహత్య Sat, Jul 12, 2025, 10:05 AM
మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.344 కోట్లు వడ్డీ లేని రుణాలు Sat, Jul 12, 2025, 06:46 AM