![]() |
![]() |
byసూర్య | Wed, Jun 18, 2025, 02:01 PM
అంగన్ వాడీ కేంద్రాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో సంక్షేమ శాఖ పని తీరుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్ వాడి కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఆదేశించారు.