![]() |
![]() |
byసూర్య | Wed, Jun 18, 2025, 01:04 PM
తెలంగాణ సచివాలయంలో గడ్డం వివేక్ వెంకట స్వామి కార్మిక, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనతో పాటు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు స్థానం కల్పించిన విషయం తెలిసిందే. కాగా అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, వాకిటి శ్రీహరికి క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్థక శాఖలు కేటాయించారు. తాజా విస్తరణతో క్యాబినెట్‌లో మంత్రుల సంఖ్య 15కి చేరింది.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంబంధింత శాఖల అధికారులు, నాయకులు వివేక్ కు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించాక కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ల (ATC) ఫైల్ పై వివేక్ తొలి సంతకం చేశారు. రూ. 2600 కోట్ల నిధులకు సంబధించిన ఫైల్ పై ఆయన సంతకం చేశారు. కాగా రాష్ట్రంలోని ఐటీఐలన్నింటిని ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే నిర్ణయించారు. ఐటీఐలు లేని చోట ఏటీసీలలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.