హైదరాబాద్ నుంచి ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటిసారిగా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి

byసూర్య | Tue, Jun 17, 2025, 08:35 PM

హైదరాబాద్ నుంచి ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటిసారిగా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు ఈ నాన్-స్టాప్ విమాన సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి.ప్రముఖ విమానయాన సంస్థ ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ఈ నూతన సర్వీసులను నిర్వహిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం, వారంలో మూడు రోజుల చొప్పున ఇరువైపులా విమానాలు నడపనున్నారు. అడిస్ అబాబా నుంచి హైదరాబాద్‌కు సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో విమానాలు రానుండగా, హైదరాబాద్ నుంచి అడిస్ అబాబాకు మంగళవారం, గురువారం, శనివారాల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.ఈ కొత్త విమాన మార్గం ద్వారా ఇథియోపియాతో పాటు, ఇతర ఆఫ్రికా దేశాలకు వెళ్లే భారతీయ వ్యాపారవేత్తలు, పర్యాటకులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. సమయం ఆదా అవడంతో పాటు, కనెక్టింగ్ విమానాల కోసం వేచి చూసే అవసరం తప్పుతుంది. అంతేకాకుండా, వైద్య సేవలు పొందేందుకు ఆఫ్రికా నుంచి భారత్‌కు వచ్చే రోగులకు ఈ డైరెక్ట్ ఫ్లైట్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇథియోపియా, నైజీరియా, టాంజానియా, ఉగాండా, రువాండా, జాంబియా, కామెరూన్, కెన్యా వంటి దేశాల నుంచి ఏటా అనేక మంది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వస్తుంటారు. వారికి ఈ నాన్-స్టాప్ సర్వీస్ ఎంతో ఊరటనివ్వనుంది


Latest News
 

హైవేపై భారీ దోపిడీ.. రూ.10 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీ Sat, Jul 12, 2025, 11:25 AM
హైడ్రా నమ్మకాన్ని కోల్పోయింది: MP విశ్వేశ్వర్‌రెడ్డి Sat, Jul 12, 2025, 11:01 AM
కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మహేష్ కుమార్ గౌడ్ Sat, Jul 12, 2025, 10:17 AM
మంచి ఉద్యోగం రావడంలేదని యువకుడు ఆత్మహత్య Sat, Jul 12, 2025, 10:05 AM
మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.344 కోట్లు వడ్డీ లేని రుణాలు Sat, Jul 12, 2025, 06:46 AM