![]() |
![]() |
byసూర్య | Tue, Jun 17, 2025, 08:25 PM
గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించండి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు. తొలి దశలో నాలుగు ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన ఉండాలని అభిప్రాయపడిన రేవంత్. అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించే కోడెల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబర్చాలని సూచనలు. వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలని ఆదేశించిన సీఎం. గో సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి వ్యయానికైనా వెనుకాడదని స్పష్టం.హాజరైన పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పశుసంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ సబ్యసాచి గోష్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఉన్నతాధికారులు