మైనారిటీ విద్యార్థుల ఉన్నత విద్యకు,,,. రూ. 20 లక్షలు.. అర్హులు వీళ్లే

byసూర్య | Sat, Jun 14, 2025, 06:37 PM

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే.. మరోవైపు మెరుగైన సమాజ స్థాపనకు కృషి చేస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని పౌరులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. వందల కోట్ల రూపాయల ఖర్చుతో.. అత్యాధునిక సౌకర్యాలతో నూతన పాఠశాలలు ప్రారంభించడానికి రెడీ అయ్యింది. ఇదిలా ఉండగా తాజాగా రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. వారందరికీ రూ.20 లక్షల ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మరి ఇంతకు ప్రభుత్వం నుంచి ఈ సాయం పొందేవారు ఎవరంటే..


ఆర్థిక కారణాల వల్ల టాలెంట్ ఉన్న విద్యార్థులు ఎవరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీఎం ఓవర్సీస్ పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీని ద్వారా పేద, మధ్య తరగతి మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తుంది. వారు విదేశాల్లో చదువుకోడానికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. దీని ద్వారా అర్హులైన మైనారిటీ విద్యార్థులు.. ప్రపంచంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఉచితంగా చదువుకోవచ్చు.


మైనారిటీల ఉన్నత చదువులకు సాయం చేయడం కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్ ఫర్ మైనారిటీస్ పథకం కింద ఎంపికైన 500 మంది మైనారిటీ విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తారు. ఈ పథకానికి ఎంపికైన మైనారిటీ విద్యార్థులు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. అయితే కొన్ని సందర్బాల్లో.. ప్రభుత్వం రూ. 20 లక్షలు లేదంటే విద్యార్థి అడ్మిషన్ లెటర్ మీద ఎంత ఫీజు ఉంటే అంత మొత్తం భరించడానికి రెడీ అవుతుంది. అంతేకాక వారు విదేశాలకు వెళ్లడానికి కావాల్సిన ఫ్లైట్ టికెట్‌ను కూడా ప్రభుత్వంమే ఉచితంగా అందస్తుంది.


మైనారిటీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. దీనికి అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ 8 జులై, 2025 న ప్రారంభం అవుతుంది. అప్లికేషన్లకు చివరి తేదీ ఆగస్టు 7, 2025 వరకు ఉంటుంది.


ఈపథకానికి అప్లై చేసుకునేవారు తమ ఆధార్ కార్డు, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఫోన్ నంబర్, మార్కుల మెమో, మైనారిటీ సర్టిఫికేట్, పాస్ ఫోటోలు వంటివి అవసరం. ఈ పథకానికి అప్లై చేసుకుని ఎంపికైన విద్యార్థులు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, సింగపూర్, జపాన తదితర దేశాల్లో చదువుకునేందుకు అనుమతి లబిస్తుంది.


Latest News
 

కొత్త రేషన్ కార్డులు.. ఇంకాస్త సమయం.. మంత్రి ఉత్తమ్ Mon, Jul 14, 2025, 11:23 PM
హైదరాబాద్, చర్లపల్లి, విశాఖ ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు Mon, Jul 14, 2025, 11:19 PM
బామ్మ.. పట్టరాని సంతోషంలో,,,,ఇందిరమ్మ ఇళ్ల పట్టా అందుకున్న Mon, Jul 14, 2025, 11:13 PM
గంజాయి, స్టెరాయిడ్స్ అమ్మకాల విషయంలో గ్యాంగుల మధ్య ఘర్షణ Mon, Jul 14, 2025, 10:07 PM
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు Mon, Jul 14, 2025, 09:59 PM