![]() |
![]() |
byసూర్య | Fri, Jun 13, 2025, 08:34 PM
జూలై 1వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 2న రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆలయం వద్ద అధికారులు, అన్ని శాఖలతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. కళ్యాణం చూసేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని తలసాని ఆదేశించారు.