KTRకు నోటీసులు.. రాజకీయ కక్ష సాధింపే: హరీశ్ రావు

byసూర్య | Fri, Jun 13, 2025, 08:31 PM

 ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధించే తప్ప మరొకటి కాదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారనడానికి నోటీసులు ఇవ్వడమే నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలు గురించి కేటీఆర్ నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, ఆయన నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి ఈ నోటీసులు పంపించారని హరీశ్ రావు ఆరోపించారు."రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18 నెలల పాలనలో డైవర్షన్ పాలిటిక్స్‌ను అమలు చేస్తూ బీఆర్ఎస్‌ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రాజకీయ అరాచకత్వం గెలిచే ప్రసక్తే లేదు. రేవంత్ రెడ్డి డ్రామా, డైవర్షన్ రాజకీయాలు ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యాయి" అని తన పోస్టులో పేర్కొన్నారు.ఫార్ములా-ఈ రేసింగ్‌తో తెలంగాణ ప్రతిష్ఠ పెరిగిందని, పెట్టుబడులు కూడా వచ్చాయని హరీశ్ రావు గుర్తుచేశారు. ఇది రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు. "2000లో చంద్రబాబు ఫార్ములా వన్ కోసం కృషిచేసి నిర్వహించలేకపోయాడు. అలాంటిది కేటీఆర్ కృషి చేసి ఫార్ములా వన్ వంటి ప్రతిష్ఠాత్మక రేస్‌ను భారతదేశానికి, అందులోనూ హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల  మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తెలంగాణను మార్చేందుకు ఫార్ములా ఈ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించారు. అమర్ రాజా వంటి కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి" అని హరీశ్ రావు వివరించారు.


Latest News
 

హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఈ ఉదయం జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది Tue, Jul 15, 2025, 09:34 AM
కొత్త రేషన్ కార్డులు.. ఇంకాస్త సమయం.. మంత్రి ఉత్తమ్ Mon, Jul 14, 2025, 11:23 PM
హైదరాబాద్, చర్లపల్లి, విశాఖ ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు Mon, Jul 14, 2025, 11:19 PM
బామ్మ.. పట్టరాని సంతోషంలో,,,,ఇందిరమ్మ ఇళ్ల పట్టా అందుకున్న Mon, Jul 14, 2025, 11:13 PM
గంజాయి, స్టెరాయిడ్స్ అమ్మకాల విషయంలో గ్యాంగుల మధ్య ఘర్షణ Mon, Jul 14, 2025, 10:07 PM