ఆసిఫాబాద్‌లో గ్రామస్తుల ఆవేదన.. ఇళ్లు కూల్చేస్తామని బెదిరింపులు

byసూర్య | Fri, May 23, 2025, 04:19 PM

ఆసిఫాబాద్ మండలంలోని ఇప్పల్ నవేగావ్ గ్రామస్తులు తమ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం ఆర్డీఓ లోకేశ్వరరావును కలిసి తమ సమస్యను వివరించారు. జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ సహకారంతో గ్రామస్తులు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
గత కొంతకాలంగా ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని కొందరు వ్యక్తులు, "మీరు ఉంటున్న గ్రామం మా పట్టాలో ఉంది, మా భూమిని మాకు అప్పగించాలి" అంటూ గ్రామస్తులను బెదిరిస్తున్నారని, లేకపోతే జేసీబీలతో ఇళ్లను కూల్చివేస్తామని హెచ్చరిస్తున్నారని గ్రామస్తులు ఆర్డీఓ ముందు వాపోయారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరారు.


Latest News
 

మార్కెట్లో నకిలీ కరాచీ మెహందీలు.. రూ. 8 లక్షల విలువైన కోన్లు స్వాధీనం Thu, Jan 15, 2026, 08:15 PM
ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు.. హైదరాబాద్‌ మెట్రోకు కొత్తగా 60 కోచ్‌లు Thu, Jan 15, 2026, 08:11 PM
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై.. సంచలన నిర్ణయం తీసుకున్న స్పీకర్ Thu, Jan 15, 2026, 07:37 PM
తెలంగాణలో కూడా జోరుగా కోడి పందేలు..! రూ.కోట్లల్లో బెట్టింగ్‌లు Thu, Jan 15, 2026, 07:33 PM
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీల సంఖ్య పెంపు Thu, Jan 15, 2026, 07:30 PM