![]() |
![]() |
byసూర్య | Mon, May 19, 2025, 10:41 AM
పిడుగుపడి యువకుడు మృతి చెందిన ఘటన దేవరకద్ర మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం. గద్దెగూడెంకు చెందిన ఉదయభాస్కర్ (19) వ్యవసాయ పొలంలో పశువులను మేపడానికి వెళ్లాడు. సాయంత్రం కురిసిన వర్షానికి చింత చెట్టు కిందకి వెళ్లాడు. చెట్టుపై పిడుగు పడడంతో ఉదయభాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు మృతుడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. యువకుడు మృతితో గ్రామంలో విషాద జాములు ఉన్నాయి.