యాంటీ నార్కోటిక్స్ విభాగంలో మొదటి బహుమతిని అందుకున్న తెలంగాణ పోలీస్

byసూర్య | Fri, May 16, 2025, 08:03 PM

హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దుబాయ్‌లో జరుగుతున్న వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025లో హైదరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకమైన అవార్డును కైవసం చేసుకున్నారు.డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంలో విశేష కృషి చేసినందుకు గాను, ఎక్సలెన్స్ ఇన్ యాంటీ-నార్కోటిక్స్ అవార్డులో హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ అవార్డును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) డీజీ సీవీ ఆనంద్ దుబాయ్ పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అందుకున్నారు. ఈ అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్-2025కు ప్రపంచంలోని 138 దేశాల నుండి ప్రముఖ పోలీసు అధికారులు హాజరయ్యారు. వారి మధ్య హైదరాబాద్ పోలీసులు మొదటి స్థానంలో నిలవడం విశేషం.ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, ఈ ప్రతిష్టాత్మక అవార్డును సాధించడంలో నార్కోటిక్ వింగ్‌లోని అధికారులు, సిబ్బంది అంకితభావం, కృషి ఎంతో ఉందని కొనియాడారు. వారి నిరంతర ప్రయత్నాల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. అంతేకాకుండా, ఈ విజయం కేవలం తెలంగాణ పోలీసులకు మాత్రమే కాకుండా, యావత్ భారతదేశ పోలీసు దళానికి గర్వకారణమని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై హైదరాబాద్ పోలీసులు తమ సత్తా చాటడం దేశానికే గర్వకారణమని ఆయన అన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం హైదరాబాద్ పోలీసులు చేస్తున్న కృషికి ఈ అవార్డు ఒక నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Latest News
 

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు Sat, Apr 18, 2026, 03:48 PM
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తాం : ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ Sat, Apr 18, 2026, 02:38 PM
మున్సిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స్ అక్రమాలు! Sat, Apr 18, 2026, 02:35 PM
బ్రిటన్ పార్లమెంట్ లో.... మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు అరుదైన గౌరవం Sat, Apr 18, 2026, 12:30 PM
జనగణనకు సిద్ధం కావాలి: అదనపు కలెక్టర్ Sat, Apr 18, 2026, 12:16 PM