![]() |
![]() |
byసూర్య | Fri, May 16, 2025, 05:10 PM
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులకు శుక్రవారం (మే 16) కీలక సూచనలు జారీ చేసింది. ఇటీవల కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఏసీబీ అధికారుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది.
ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఏసీబీ పేరు చెప్పి డబ్బులు అడిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఏసీబీ సూచించింది. అటువంటి సంఘటనలు ఎదురైతే వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని కోరింది.
అసలైన ఏసీబీ అధికారులు అధికారిక విధానాల ప్రకారమే వ్యవహరిస్తారని, ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు అడిగే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఫేక్ కాల్స్‌కు లోనవ్వకండి, మీ హక్కులను కాపాడుకోండి అని ఏసీబీ హెచ్చరించింది.