![]() |
![]() |
byసూర్య | Fri, May 16, 2025, 05:07 PM
జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఒక వినూత్న నిరసన చోటుచేసుకుంది. మాజీ సైనికోద్యోగి వేదవ్యాస్ మౌన దీక్షకు దిగారు. ఆయన చెబుతున్న వివరాల ప్రకారం, మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న తోపారపు జగదీశ్వర్ తన పరిచయ వ్యక్తి ఒడ్నాల రామారావుకు రూ. 5 లక్షలు ఇప్పించినట్టు తెలిపారు. అయితే, ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు జగదీశ్వర్అయనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వేదవ్యాస్ వాపోయారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల స్పందన లేకపోవడంతో చివరికి మౌన దీక్ష మార్గాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని వేదవ్యాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.