ఇబ్రహీంపట్నంలో బిర్యానీలో బల్లి ఘటన.. యజమాని వివాదాస్పద వ్యాఖ్యలు

byసూర్య | Fri, May 16, 2025, 01:11 PM

ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై ఉన్న మెహఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్ గుజ్జా కృష్ణారెడ్డికి వడ్డించిన ప్లేటులో బల్లి కనిపించింది. ఈ విషయాన్ని రెస్టారెంట్ యజమానిని ప్రశ్నించగా, ఆయన “మంచిగా ఫ్రై అయింది, తినండి” అని వివాదాస్పద సమాధానం ఇచ్చాడు.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణారెడ్డి, షేరిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రెస్టారెంట్ మేనేజర్‌ను స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెస్టారెంట్‌లో ఆహార పరిశుభ్రతపై సీరియస్ ప్రశ్నలు లేవనెత్తింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

54 ఏళ్ల తర్వాత వేముల వాడ రోడ్డు విస్తరణకు మోక్షం Tue, Jun 17, 2025, 09:30 PM
హైదరాబాద్ నుంచి ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటిసారిగా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి Tue, Jun 17, 2025, 08:35 PM
కలెక్టర్ వల్లూరు క్రాంతికి శుభాకాంక్షలు తెలిపిన ఖేఢ్ ఎమ్మెల్యే Tue, Jun 17, 2025, 08:27 PM
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది Tue, Jun 17, 2025, 08:27 PM
గోశాలల అభివృద్ధి, నిర్వహణ విధానంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష Tue, Jun 17, 2025, 08:25 PM