![]() |
![]() |
byసూర్య | Fri, May 16, 2025, 01:08 PM
తెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టం అమలులో భాగంగా కర్ణాటకలో విజయవంతంగా అమలవుతున్న లైసెన్స్‌డ్ సర్వే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ విధానంలో మొత్తం 5,000 మంది సర్వేయర్లను నియమించనున్నట్లు ఆయన తెలిపారు.
దీనిలో భాగంగా మే 17 (రేపటి) నుంచి లైసెన్స్‌డ్ సర్వే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ సర్వే అకాడమీలో శిక్షణ అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.