పెళ్లి చూపుల కోసం,,,సోషల్ మీడియాలో టిప్స్ అడిగిన అబ్బాయి

byసూర్య | Wed, May 14, 2025, 07:40 PM

పెళ్లి చూపులు అనేది వివాహానికి ముందు కాబోయే వధూవరులు ఒకరినొకరు తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసే ఒక సాంప్రదాయ పద్ధతి. ఇది తరతరాలుగా భారతీయ సమాజంలో కొనసాగుతూ వస్తోంది. అయితే.. కాలక్రమేణా ఈ పద్ధతిలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా.. సాంకేతికత అభివృద్ధి చెందడం, సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియలో గణనీయమైన మార్పులు సంభవించాయి. గతంలో.. కుటుంబ సభ్యులు, బంధువులు వధూవరుల గురించి సమాచారం సేకరించి సంబంధాలు కుదిర్చేవారు. ఈ ప్రక్రియలో వారి అభిప్రాయాలకు అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు.


కానీ.. నేడు యువతీయువకులు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఎక్కువ స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఇంటర్నెట్ , స్మార్ట్‌ఫోన్‌ల రాకతో.. పెళ్లి సంబంధాల కోసం అనేక వెబ్‌సైట్లు మరియు యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి వధూవరులు తమ వివరాలను నమోదు చేసుకుని, తమకు కావలసిన లక్షణాలు ఉన్న భాగస్వామిని ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు యువతీయువకులు తమ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకోవడానికి ఒక వేదికగా మారాయి. పెళ్లి చూపులకు సంబంధించిన ఈ పోస్ట్ కూడా అలాంటిదే.


‘శుక్రవారం నాకు పెళ్లి చూపులు, ఏమైనా సలహాలుంటే చెప్పండి’ అని ఒక వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. వారి సలహాలు నవ్వులు పూయించేలా.. ఆలోచనలో పడేసేలా ఉన్నాయి. కొందరు సరదాగా స్పందించగా, మరికొందరు సీరియస్‌గా సలహాలు ఇచ్చారు.


ఒక నెటిజన్ చమత్కరిస్తూ.. పెళ్లి చూపులకు వెళ్లేముందు టెస్టోస్టెరాన్ సర్టిఫికేట్, సిబిల్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి అని సలహా ఇచ్చాడు. మరొకరు మరింత ముందుకెళ్లి.. ముందు అమ్మాయికి వేరే ఎవరితోనైనా సంబంధం ఉందో లేదో తెలుసుకో బ్రూ.. లేదంటే నీ జీవితం అంతే ఇక.. అని హెచ్చరించాడు. పోస్ట్ పెట్టిన వ్యక్తి దీనికి స్పందిస్తూ.. ‘నేను అలా అడగలేను’ అని బదులిచ్చాడు.


చాలామంది అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఆల్ ది బెస్ట్’ అని కామెంట్ చేయగా.. అతను ‘భయంగా ఉంది’ అని బదులివ్వడం విశేషం. మరొక నెటిజన్ పెళ్లి చేసుకోవడం కన్నా ఒంటరిగా ఉండటమే మంచిదని అభిప్రాయపడ్డాడు. గతంలో అమ్మాయిలు పెళ్లి చూపులంటే భయపడేవారని.. కానీ ఇప్పుడు అబ్బాయిలు భయపడాల్సిన పరిస్థితి నెలకొందని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నెటిజన్ మరింత వినూత్న సలహా ఇస్తూ.. ‘సిబిల్ స్కోర్, టెస్టోస్టెరాన్ సర్టిఫికేట్‌తో పాటు శాలరీ పేమెంట్ స్లిప్ కూడా పట్టుకెళ్లు’ అని సూచించాడు.


మరొక నెటిజన్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. ‘బ్రో నాకు ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి నేరుగా ఫోటో పెట్టమని అడిగితే పంపాను. అమ్మాయి మీరు చాలా నచ్చారని చెప్పింది. వాళ్ల అమ్మ నాన్న వచ్చి చూసుకుని మాకు అబ్బాయి ఓకే, మంచి రోజు చూసుకుని రండి అన్నారు. తర్వాత ఒక రోజు ఆ అమ్మాయి నాతో చాలాసేపు మాట్లాడి మీరు నచ్చారని చెప్పింది. మా ఇష్టాయిష్టాలు పంచుకున్నాం. అంతా బాగానే ఉంది. కానీ సడన్‌గా ఏమైందో ఏంటో సారీ అండి మా అమ్మానాన్నకి మీరు నచ్చారనే ఓకే చెప్పాను.


కానీ మీరు నాకు నచ్చలేదు అని షాక్ ఇచ్చింది బ్రో. నాకేం అర్థం కాలేదు. సో రేపు ఫిబ్రవరి 14 అనగా ఇది అంతా జరిగింది. అండ్ నేనే తనకి నచ్చలేదు అని చెప్పు పెళ్లి కాన్సెల్ చేయండి అని చాలా రిక్వెస్ట్ చేసింది బ్రో. రెండు వారాల తరువాత ఎవరినో లవ్ చేసి లేచిపోయింది అని తెలిసింది. బతికిపోయావు రా బాబు అనుకున్నా. చాలా డేంజర్ ఉన్నారు బ్రో గర్ల్స్ ఈ జనరేషన్ లో’ అని తన బాధను చెప్పుకొచ్చాడు.


నెటిజన్లు తమకు తోచిన విధంగా సలహాలు, సూచనలు చేశారు. ఈ పోస్ట్ సరదాగా పెట్టాడో, సీరియస్‌గా పెట్టాడో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఇచ్చే సలహాలు కూడా ఆలోచింపజేసే విధంగానే ఉన్నాయి. ప్రస్తుత తరం ధోరణిని ఈ పోస్ట్ ప్రతిబింబిస్తుంది.



Latest News
 

నకిలీ బాబా ముఠా వల,,,రూ. 15 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు Sat, Jun 14, 2025, 06:58 PM
మందుబాబులకు కొత్త బార్లు వచ్చేశాయ్ Sat, Jun 14, 2025, 06:53 PM
ఈ పాఠశాలల్లో ఒక్క అడ్మిషన్ దొరికితే చాలు.... లైఫ్ సెటిల్ Sat, Jun 14, 2025, 06:49 PM
ఇందిరమ్మ లబ్దిదారులకు .. అదనంగా రూ.లక్ష సాయం Sat, Jun 14, 2025, 06:44 PM
మైనారిటీ విద్యార్థుల ఉన్నత విద్యకు,,,. రూ. 20 లక్షలు.. అర్హులు వీళ్లే Sat, Jun 14, 2025, 06:37 PM