![]() |
![]() |
byసూర్య | Tue, May 13, 2025, 11:55 AM
తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన బోరెడ్డి అయోధ్యరెడ్డి రాష్ట్ర సమాచార కమిషనర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (సీపీఆర్)గా విధులు నిర్వహిస్తున్నారు.
సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన అయోధ్యరెడ్డి, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి, 20 సంవత్సరాల పాటు వివిధ దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో అధికార ప్రతినిధిగా, మీడియా కోఆర్డినేటర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను సీపీఆర్‌గా నియమించి, ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు రాష్ట్ర సమాచార కమిషనర్‌గా నియమితులైన అయోధ్యరెడ్డి, తన వృత్తి నైపుణ్యంతో మరింత సమర్థవంతంగా సేవలందించనున్నారు.