చార్మినార్ వద్ద 72వ మిస్ వరల్డ్ 2025 హెరిటేజ్ వాక్

byసూర్య | Tue, May 13, 2025, 11:51 AM

నగరంలోని చారిత్రక చార్మినార్ వద్ద నేడు మంగళవారం “72వ మిస్ వరల్డ్ 2025 హెరిటేజ్ వాక్” ఘనంగా జరగనుంది. మిస్ వరల్డ్ పోటీలో భాగంగా ఈ హెరిటేజ్ వాక్‌లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పోటీదారులు పాల్గొని, హైదరాబాద్ నగర వారసత్వ సంపదను ప్రపంచానికి చాటనున్నారు. 
ఈ కార్యక్రమం అనంతరం చౌమల్లా ప్యాలెస్‌లో మిస్ వరల్డ్ ప్రతినిధుల కోసం వెల్కమ్ డిన్నర్ నిర్వహించనున్నారు. రేపు (మే 14) పోటీదారుల్లో ఒక బృందం వరంగల్ జిల్లాలో పర్యటించి, అక్కడి చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని సందర్శించనుంది. 
ఈ హెరిటేజ్ వాక్ ద్వారా తెలంగాణ రాష్ట్రం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.


Latest News
 

నిర్భయ నిధి కింద ములుగు జిల్లా ఎంపిక .... కేంద్రమంత్రికి సీతక్క ధన్యవాదాలు Sat, Mar 14, 2026, 10:45 PM
బస్తీ బాటలో పాల్గొన్న జలమండలి ఎండీ అశోక్ రెడ్డి Sat, Mar 14, 2026, 09:11 PM
స్వశక్తి సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా హామీ Sat, Mar 14, 2026, 09:07 PM
ఆస్తిపన్ను బకాయిలపై చర్యలు…రాజీవ్ గాంధీ నగర్‌లో 3భవనాలు సీజ్ Sat, Mar 14, 2026, 09:03 PM
విద్యార్థినికి అండగా మేము సైతం మీకోసం ఫౌండేషన్ Sat, Mar 14, 2026, 09:02 PM