బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

byసూర్య | Tue, May 13, 2025, 10:55 AM

రామన్నపేట మండల కేంద్రంలో కురుమ సంఘం వారు బీరప్ప స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు మరియు టిఆర్ఎస్ పార్టీ బోనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్ క్యామ మల్లేష్ హాజరు కావడం జరిగింది. బీరప్ప గుడి వద్ద దేవుని దర్శనం చేసుకొని బీరప్ప స్వామి ఆశీస్సులు రామన్నపేట పట్టణ ప్రజలపై ఉండాలని అందరూ సుభిక్షంగా ఉండాలని తెలియ జేయడం జరిగింది. వీరికి దేవస్థానం కమిటీ కురుమ సంఘం వారు శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మాజీ ఎంపీటీసీలు సాల్వేర్ అశోక్, గొరిగే నరసింహ, వేమవరం సుధీర్ బాబు, వున్న వెంకటేశం, ఎండి అమీర్, జిల్లా నాయకులు బద్దుల రమేష్, ఎస్.కె చాంద్, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, యువజన విభాగం మండల అధ్యక్షుడు బత్తుల వెంకటేశం, నాయకులు మిర్యాల మల్లేశం, బొడ్డు అల్లయ్య, జాల అమరేందర్ రెడ్డి, ఎండి అజాజ్, వంగాల యాదయ్య, నల్ల సైదులు, మేడి కృష్ణ, ఎండి మోసబ్, కుక్కు సాయి, కొండగడప చింటూ, ఆముద శ్రీను, బెడిదే లింగస్వామి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

54 ఏళ్ల తర్వాత వేముల వాడ రోడ్డు విస్తరణకు మోక్షం Tue, Jun 17, 2025, 09:30 PM
హైదరాబాద్ నుంచి ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటిసారిగా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి Tue, Jun 17, 2025, 08:35 PM
కలెక్టర్ వల్లూరు క్రాంతికి శుభాకాంక్షలు తెలిపిన ఖేఢ్ ఎమ్మెల్యే Tue, Jun 17, 2025, 08:27 PM
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది Tue, Jun 17, 2025, 08:27 PM
గోశాలల అభివృద్ధి, నిర్వహణ విధానంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష Tue, Jun 17, 2025, 08:25 PM