ప్ర‌జావాణిలో అధికారికి ప్ర‌జ‌ల స‌త్కారం

byసూర్య | Tue, May 13, 2025, 10:50 AM

ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేసిన వెంట‌నే స్పందించి స‌మ‌స్య ప‌రిష్క‌రించిన‌ హైడ్రా అధికారిని.. అదే ప్ర‌జావాణిలో ప్ర‌జ‌లు స‌త్క‌రించారు. మిఠాయి తినిపించి.. క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్‌గారి చేతుల మీదుగా ఇన్‌స్పెక్ట‌ర్ తిరుమ‌లేష్‌ను స‌న్మానించారు.  వేలాది మంది నివాసితుల‌కు మీ అధికారులు దారి చూపారంటూ హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారితో సంతోషం పంచుకున్నారు.  రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం కాటేదాన్ ద‌గ్గ‌ర మ‌ధుబ‌న్ కాల‌నీకి అనుకుని ఉన్న ఇందిరాగాంధీ కో ఆప‌రేటివ్  హౌసింగ్ సొసైటీలో మొత్తం 800ల ప్లాట్లున్నాయి.  కాటేదాన్ నుంచి శ్రీ‌రాం కాల‌నీకి వెళ్లే ప్ర‌ధాన 60 అడుగుల ర‌హ‌దారిని క‌లిపే 20 అడుగుల ర‌హ‌దారికి అడ్డంగా నిర్మించిన గోడ‌ల‌ను ఈ నెల 6వ తేదీన హైడ్రా తొల‌గించింది. దీంతో ఇందిరాగాంధీ కోప‌రేటివ్ హౌసింగ్ సొసైటీతో పాటు శ్రీ‌రాంన‌గ‌ర్ కాల‌నీ వాళ్ల‌కు కూడా ద‌గ్గ‌ర దారి దొరికింద‌ని అక్క‌డి నివాసితులు సంతోషం వ్య‌క్తం చేశారు. లేదంటే 4 కిలోమీట‌ర్లు అద‌నంగా ప్ర‌యాణించాల్సి వ‌చ్చేద‌ని..చెబుతూ ఫిర్యాదు అందిన వెంట‌నే స‌మ‌స్య ప‌రిష్క‌రించిన హైడ్రా అధికారుల‌ను నివాసితులు అభినందించారు.


Latest News
 

హైదరాబాద్ చుట్టూ.. రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రింగ్ రైలు Sun, Mar 15, 2026, 08:13 PM
నర్మెటలో ఆయిల్‌ పామ్‌ రిఫైనరీ,,,,నిరుద్యోగులకు ఉపాధి Sun, Mar 15, 2026, 08:09 PM
ఏ డ్రగ్స్ టెస్టుకైనా సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ ప్రకటించారు Sun, Mar 15, 2026, 07:57 PM
అత్తాపూర్‌లో రూ.500 కోట్ల విలువైన భూమి స్వాధీనం,,,హైడ్రా మరో భారీ ఆపరేషన్ Sun, Mar 15, 2026, 06:26 PM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు Sun, Mar 15, 2026, 06:21 PM