రెండో పెళ్లికి అడ్డుగా ఉందని 5 నెలల పసికందును చంపేసిన అమ్మ, అమ్మమ్మ.

byసూర్య | Tue, May 13, 2025, 10:47 AM

రెండో పెళ్లికి అడ్డుగా ఉందని 5 నెలల పసికందును చంపేసిన అమ్మ, అమ్మమ్మ. పిఠాపురం మండలం నరసింగపురానికి చెందిన శైలజ రెండేళ్ల క్రితం సతీష్ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. కొద్ది కాలం క్రితం తిరిగి ఇంటికొచ్చిన శైలజ, 5 నెలల క్రితం యశ్విత అనే పసిబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శైలజ మనసు మార్చి, తనకు తన కులంకి చెందిన వ్యక్తితో రెండో వివాహం జరిపించాలని శైలజ అమ్మ అన్నవరం నిర్ణయించింది. దీనికి పాప యశ్విత అడ్డు తొలగించాలని, 5 నెలల పసికందును ఈ నెల 6న గొంతు నులిమి చంపేసి.. ఇంటి పక్కనే ఉన్న బావిలో పడేశారు. తర్వాత ఎవరో తమ ఇంటికి క్షుద్ర పూజలు చేసి చిన్నారిని చంపేశారని ఇంటి ముందు ముగ్గు వేసి, నిమ్మకాయలు పెట్టి నమ్మించారు. చివరకు పోలీసులు తమ రీతిలో విచారణ జరపగా చిన్నారిని తామే చంపినట్టు అమ్మ, అమ్మమ్మ ఒప్పుకున్నారు


 


 


Latest News
 

54 ఏళ్ల తర్వాత వేముల వాడ రోడ్డు విస్తరణకు మోక్షం Tue, Jun 17, 2025, 09:30 PM
హైదరాబాద్ నుంచి ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటిసారిగా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి Tue, Jun 17, 2025, 08:35 PM
కలెక్టర్ వల్లూరు క్రాంతికి శుభాకాంక్షలు తెలిపిన ఖేఢ్ ఎమ్మెల్యే Tue, Jun 17, 2025, 08:27 PM
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది Tue, Jun 17, 2025, 08:27 PM
గోశాలల అభివృద్ధి, నిర్వహణ విధానంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష Tue, Jun 17, 2025, 08:25 PM