రేపు విజయవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్

byసూర్య | Tue, Apr 29, 2025, 05:20 PM

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి బెజవాడకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 9.15 గంటలకు రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరుతారు. ఉదయం 10.40 గంటలకు విజయవాడ సమీపంలోని కానూరులో ఉన్న ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో ఉదయం 10.50 గంటల నుంచి 11.30 గంటల వరకు జరిగే వివాహ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం విజయవాడ నుంచి తిరుగుపయనమవుతారు. మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకుంటారు.గత వారం దేవినేని ఉమా హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డిని కలిసి, తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. పెళ్లికి తప్పకుండా హాజరు కావాలని ఆయన సీఎంను ఆహ్వానించారు. గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు దేవినేని ఉమాతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. పార్టీలు మారినప్పటికీ వారి మధ్య స్నేహ బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మిత్రుడి ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి ఈ వివాహానికి హాజరవుతున్నారు.


Latest News
 

అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్.. భారీ పద్దు.. అరకొర చర్చ! Mon, Mar 16, 2026, 08:30 PM
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయానికి వెళ్లడం ఆసక్తిని రేకెత్తించింది Mon, Mar 16, 2026, 08:03 PM
విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు: మండల ప్రత్యేక అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం Mon, Mar 16, 2026, 07:56 PM
ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ! Mon, Mar 16, 2026, 07:51 PM
ఎస్సీ నిరుద్యోగులకు శుభవార్త: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాలు – దరఖాస్తులు ప్రారంభం! Mon, Mar 16, 2026, 07:47 PM