తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు

byసూర్య | Tue, Apr 29, 2025, 04:58 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన బెజవాడకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 9.15 గంటలకు రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరుతారు. ఉదయం 10.40 గంటలకు విజయవాడ సమీపంలోని కానూరులో ఉన్న ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో ఉదయం 10.50 గంటల నుంచి 11.30 గంటల వరకు జరిగే వివాహ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం విజయవాడ నుంచి తిరుగుపయనమవుతారు. మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకుంటారు.గత వారం దేవినేని ఉమా హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డిని కలిసి, తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. పెళ్లికి తప్పకుండా హాజరు కావాలని ఆయన సీఎంను ఆహ్వానించారు. గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు దేవినేని ఉమాతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. పార్టీలు మారినప్పటికీ వారి మధ్య స్నేహ బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మిత్రుడి ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి ఈ వివాహానికి హాజరవుతున్నారు.మరోవైపు, ఈ వివాహ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరవనున్నారు. ఈ క్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలుసుకునే అవకాశం ఉంది. 


Latest News
 

ఒక్కో కుటుంబానికి రూ.14 వేలు బెనిఫిట్....కొత్త పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి Mon, Jan 19, 2026, 09:36 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్యే హరీశ్‌రావుకు నోటీసులు Mon, Jan 19, 2026, 09:32 PM
డబుల్ బెడ్రూం ఇండ్లలో ,,,,,అక్రమాలను వెలికితీసేందుకు ప్రభుత్వం వినూత్న సర్వే Mon, Jan 19, 2026, 09:10 PM
సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరులో జాప్యం చేస్తున్నారన్న కేటీఆర్ Mon, Jan 19, 2026, 07:52 PM
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది: రేణుకా చౌదరి Mon, Jan 19, 2026, 07:30 PM