ప్రమాదవశాత్తు చిన్నారి మృతి

byసూర్య | Tue, Apr 29, 2025, 03:30 PM

తెలంగాణ రాష్ట్రము, రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం లష్కర్‌గూడలో నాలుగేళ్ల చిన్నారి పల్లిగింజ గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది.అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లష్కర్‌గూడ నివాసితులైన బండారి మహేశ్వరి, శ్యామ్‌సుందర్‌ దంపతుల ఏకైక కుమార్తె తన్విక (4). ఆ చిన్నారి ఆదివారం ఇంట్లో వేయించిన పల్లీలు తింటుండగా, ప్రమాదవశాత్తు ఓ పల్లిగింజ గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న విషయాన్ని తన్విక తల్లిదండ్రులకు చెప్పింది.విషయం తెలుసుకున్న వెంటనే ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, తన్వికను హుటాహుటిన హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు, గొంతులో పల్లిగింజ ఇరుక్కున్నట్లు నిర్ధారించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించడంతో తన్విక మరణించినట్లు వైద్యులు తెలిపారు.ఒక్కగానొక్క కుమార్తె అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


Latest News
 

ఏకంగా రూ.1000 కోట్లతో ఫండ్,,,గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి Wed, Dec 10, 2025, 09:48 PM
ఓయూకు రూ.1000 కోట్ల నిధుల విడుదల.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం Wed, Dec 10, 2025, 07:53 PM
2 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులు,,,,ఇకపై అర్థరాత్రి కూడా దర్జాగా తిరగొచ్చు Wed, Dec 10, 2025, 07:46 PM
ఆ 14 గ్రామాల్లో ఇద్దరు సర్పంచ్‌లు, రెండు ఓట్లు.... ఇంకా తెగని పంచాయతీ Wed, Dec 10, 2025, 07:41 PM
చదువును అమ్మాయితో పోల్చిన ప్రొఫెసర్ కాశీం.. రేవంత్ రెడ్డి ప్రేమలో పడ్డారంటూ Wed, Dec 10, 2025, 07:36 PM