రుణం చెల్లించలేని వారి వ్యక్తిగత సమాచారంతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని వెల్లడి

byసూర్య | Tue, Apr 22, 2025, 07:24 PM

రుణాలిచ్చే యాప్‌ల ఉచ్చులో చిక్కుకోవద్దని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఆయన ట్వీట్ చేశారు. రుణ యాప్ నిర్వాహకులు ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రజలని ఏమారుస్తున్నారని పేర్కొన్నారు.లోన్ రిజిస్ట్రేషన్ పేరుతో ఫోన్ కాంటాక్టులు, గ్యాలరీ ఫొటోలు, ఇతర వివరాలను సేకరించి, రుణం చెల్లించలేని పరిస్థితులు వచ్చినప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ వేధిస్తున్నారని తెలిపారు. దీంతో ఎంతోమంది మనోవేదనకు గురై ప్రాణాలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.లోన్‌ యాప్స్‌ నిర్వహకులు వేధింపులకు గురిచేస్తే భయపడవద్దని అన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 1930కి ఫోన్ కాల్ చేసి వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏం చేయలేమనే ఆందోళనకు గురికావొద్దని ధైర్యం చెప్పారు. ఇందుకు సంబంధించిన ఒక వార్తా కథనాన్ని కూడా ఆయన తన ట్వీట్‌కు జతపరిచారు.


Latest News
 

హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో విపరీత అగ్ని: ఎందుకంటే ఇంకా తెలియనిది Tue, Jan 13, 2026, 11:30 PM
రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్.. "డైవర్షన్ పాలిటిక్స్ కోసమే సిట్‌లు, విచారణలు" Tue, Jan 13, 2026, 10:40 PM
పాతబస్తీలో భారీగా విద్యుత్ చోరీ.. ఏడాదికి రూ.600 కోట్ల నష్టం? ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ట్వీట్! Tue, Jan 13, 2026, 10:37 PM
శ్రేయస్సును ఇచ్చే సంక్రాంతి.. రంగారెడ్డి జిల్లా ప్రజలకు చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పండగ శుభాకాంక్షలు Tue, Jan 13, 2026, 10:33 PM
హత్యకారిణిగా మారుతున్న చైనా మాంజా: సీరియస్ అయిన మానవ హక్కుల కమిషన్ Tue, Jan 13, 2026, 10:32 PM