గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం మద్యం ఆదాయం ఎలా పెంచిందో అందరికీ తెలుసు : మంత్రి జూపల్లి

byసూర్య | Tue, Mar 25, 2025, 08:40 PM

బెల్టు షాపులు పెంచిన ఘనత బిఆర్‌ఎస్ దేనని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మంగళంవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ నాయకులపై మంత్రి జూపల్లి మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అడిగిన మద్యం అమ్మకాలపై ప్రశ్నకు జూపల్లి సమాధానం ఇస్తూ గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2014లో రూ. 9,000 కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని 2023 వరకు రూ. 34,000 కోట్లకు ఎలా పెంచిందో అందరికీ తెలుసన్నారు. చట్టవిరుద్ధంగా బెల్ట్ షాపులను పెంచి వాటి ద్వారా అక్రమంగా మద్యం అమ్మించారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం స్మగ్లింగ్ ఆపడానికి దాడులు చేస్తోందని,ఫామ్ హౌస్‌లలో మద్యం తాగడాన్ని నిషేధించిందని సమాధానమిచ్చారు. ప్రశాంత్ రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇస్తూ ఆర్‌ఆర్‌ఆర్ పనుల కోసం భూసేకరణ పనులకు అనుమతి వచ్చిందని, నిధుల విడుదలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని త్వరలోనే కలుస్తున్నామని చెప్పారు. విపక్ష నేతల నియోజకవర్గాల్లో రోడ్ల మరమ్మత్తుల కోసం నిధులు మంజూరు చేయడం లేదనేది అబద్దం అని, హరీష్ రావు, కేటీఆర్ నియోజకవర్గాల్లో రోడ్ల మరమ్మత్తుల కోసం, నూతన రోడ్లకు సరిపడా నిధులు కేటాయిస్తున్నామని వెంకటరెడ్డి సమాధానమిచ్చారు.


 


 


Latest News
 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి Thu, Apr 17, 2025, 09:55 PM
సింగరేణి ఉద్యోగి కుటుంబానికి చెక్కుల పంపిణీ Thu, Apr 17, 2025, 09:52 PM
బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి Thu, Apr 17, 2025, 09:48 PM
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి Thu, Apr 17, 2025, 09:46 PM
కామారెడ్డిలో 22న ఉద్యోగ మేళా Thu, Apr 17, 2025, 09:43 PM