బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు

byసూర్య | Mon, Mar 24, 2025, 08:36 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, కిషోర్ గౌడ్ తదితరులు ఫిర్యాదు చేశారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు.అనంతరం దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, బండి సంజయ్ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. కేసీఆర్ మీద నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌పై చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు.బండి సంజయ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, కేసీఆర్‌కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించి ప్రింటింగ్ ప్రెస్ ఉందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ నోట్లనే పంచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ మీద పలుచోట్ల ఫిర్యాదు చేస్తున్నారు


Latest News
 

మాగంటి గోపీనాథ్ మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన తల్లి Sun, Nov 09, 2025, 06:22 AM
హరీశ్ రావు సవాల్: జూబ్లీహిల్స్ ఓటర్లు తేల్చండి – లేడీనా, రౌడీనా? Sat, Nov 08, 2025, 11:45 PM
బండి సంజయ్ సంచలనం: మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ, ఆస్తులు కొట్టేందుకు కుట్రల ఆరోపణలు Sat, Nov 08, 2025, 11:36 PM
KTR సిగ్నల్: 14 తర్వాత రాష్ట్రంలో ఎవరు దూకుడుగా ఉంటారో గమనిస్తాం!” Sat, Nov 08, 2025, 11:17 PM
“జూబ్లీహిల్స్ రాజకీయ రణభూమి: టీడీపీ-బీజేపీ గ్యాప్ పెరుగుతోంది” Sat, Nov 08, 2025, 10:47 PM