డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలిపిందన్న కేకే

byసూర్య | Sun, Mar 23, 2025, 08:52 PM

డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ చెన్నైలో జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతును ప్రకటించిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తెలిపారు. డీలిమిటేషన్ వ్యవహారంలో ప్రస్తుత కథానాయకుడు స్టాలిన్ అయినప్పటికీ హీరో మాత్రం రేవంత్ రెడ్డేనని అన్నారు. హైదరాబాద్ లో సభ పెడతామని చెప్పడం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కీలక పరిణామమని చెప్పారు. ఈ సభ రాజకీయ అజెండాను మలుపు తిప్పే అవకాశం ఉందని అన్నారు.డీలిమిటేషన్ అనేది కేవలం పార్లమెంట్ సీట్ల పెంపు గురించి మాత్రమే ఉండకూడదని అన్నారు. జనాభా గణన జరిగిన తర్వాత ప్రతిసారి ఇదే వివాదం తెరపైకి వస్తుందని చెప్పారు. పార్లమెంట్ లో ప్రతి రాష్ట్రానికి బలమైన ప్రాతినిధ్యం ఉండాలని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫెడరలిజాన్ని పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు. స్టేట్ లిస్ట్ ను తగ్గించి, సెంట్రల్ లిస్ట్ ను పెద్దది చేశారని మండిపడ్డారు. దీని ఫలితంగా రాష్ట్రాల హక్కులు తగ్గిపోతున్నాయని చెప్పారు.జమ్మూకశ్మీర్, అసోం వంటి ప్రాంతాల్లో సీట్లను పెంచే ప్రయత్నం చేస్తున్నారని... దక్షిణాదికి అన్యాయం జరిగేలా అడుగులు వేస్తున్నారని కేకే మండిపడ్డారు. అమిత్ షా వంటి వ్యక్తుల మైండ్ సెట్ తో సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. 


Latest News
 

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వ్యవహారం కొత్త మలుపు Tue, Apr 22, 2025, 07:27 PM
రుణం చెల్లించలేని వారి వ్యక్తిగత సమాచారంతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని వెల్లడి Tue, Apr 22, 2025, 07:24 PM
ఫోఫ్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు Tue, Apr 22, 2025, 04:24 PM
వేసవి దృష్ట్యా జరిగే దొంగతనాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ Tue, Apr 22, 2025, 04:19 PM
చలివేంద్రం ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 04:18 PM