ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ.. అక్కడకు వెళ్లామంటే ఇక స్వర్గమే

byసూర్య | Mon, Mar 17, 2025, 10:20 PM

రెండు సంవత్సరాల క్రితం మెదక్‌కు రైల్వేలైన్‌ అందుబాటులోకి రాగానే ప్రయాణికుల రాకపోకలకు మంచి మార్గం ఏర్పడింది. ఇటీవల విద్యుత్తు ఆధారిత రాకపోకల కోసం చర్యలు తీసుకోవడంతో రైల్వే సేవలు మరింత సౌకర్యవంతంగా మారాయి. టికెట్ల ద్వారా పొందిన ఆదాయం వేలల్లో ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మెదక్ రైల్వే స్టేషన్‌కు మరింత అభివృద్ధి కల్పించేందుకు నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రారంభమైన పనులు.. రాబోయే కొన్ని నెలల్లో పూర్తి కానున్నాయి.


2012-13 సంవత్సరంలో.. కేంద్ర ప్రభుత్వం రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్ వరకు 17.2 కి.మీ. రైల్వే లైన్ నిర్మించేందుకు శంకుస్థాపన చేసింది. 2014లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. 210 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైల్వే లైన్‌ను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం మధ్య కాచిగూడ వరకు ప్యాసింజర్‌ రైలు కొనసాగుతోంది. అలాగే పలు గూడ్స్ రవాణా కూడా ఈ మార్గం ద్వారా జరుగుతోంది.


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమృత్‌ భారత్‌ పథకం కింద 10 స్టేషన్లను ఎంపిక చేయగా.. దీనిలో మెదక్‌కు కూడా చోటు దక్కింది. గతేడాది ఫిబ్రవరి 26న ప్రధాని మోదీ వర్చువల్‌ ద్వారా పనులకు శంకుస్థాపన చేశారు. రూ.15.20 కోట్లతో మెదక్ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ ప్రాజెక్టులో అనేక కొత్త సౌకర్యాలు అందుబాటులోకి రాబోతున్నాయి. రైల్వే స్టేషన్ వద్ద మెరుగైన పార్కింగ్‌ సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ప్రయాణికులు ముచ్చటగా సెల్ఫీలు తీసుకునేందుకు ప్రత్యేకంగా పాయింట్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు కీలకమైన బోర్డులు అమలు చేయబడతాయి.


పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సౌకర్యంగా లిఫ్ట్‌ ఏర్పాట్లు చేయబడ్డాయి. స్టేషన్ ప్లాట్‌ఫాం ఆకర్షవంతంగా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి అవసరమైన వాటిని కొనుగోలు చేస్తున్నారు. దివ్యాంగులకు ప్రత్యేక శౌచాలయాలు, ర్యాంపులు ఏర్పాటు చేయబడ్డాయి. విద్యుత్‌ సరఫరాకు ఆటంకం కలగకుండా పనిచేసే జనరేటర్లు ఏర్పాటు చేయడం వంటి సౌకర్యాలు అందుబాలోకి రానున్నాయి. వీటితో పాటు.. విద్యుత్తు దీపాలు, సంకేతాలను(సైన్ బోర్డులు) కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్యలు మెదక్ రైల్వే స్టేషన్‌ను మరింత ఆధునికంగా మార్చి.. ప్రయాణికుల కోసం సౌకర్యాలను పెంచే దిశగా వేగంగా అడుగుల పడుతున్నాయి.


Latest News
 

ఫోఫ్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు Tue, Apr 22, 2025, 04:24 PM
వేసవి దృష్ట్యా జరిగే దొంగతనాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ Tue, Apr 22, 2025, 04:19 PM
చలివేంద్రం ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 04:18 PM
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంత మంది పాసయ్యారంటే? Tue, Apr 22, 2025, 04:16 PM
ప్రతి వాహనంలో డాష్ కెమెరాల ఏర్పాటు: ఎస్పీ Tue, Apr 22, 2025, 03:47 PM