లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

byసూర్య | Mon, Mar 17, 2025, 07:57 PM

లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అసెంబ్లీ కమిటీ హాలులో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, మజ్లిస్ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రతినిధులు హాజరు కాలేదు.నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించాయని, దీంతో పునర్విభజన జరిగితే నష్టం జరుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పునర్విభజనపై గళమెత్తుతున్నారు.


Latest News
 

రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ ఘనవిజయం.. ప్రజాబలమే కీలకమని నాయకులు Sat, Dec 13, 2025, 12:35 PM
కవ్వాల్ సర్పంచ్ గా సక్రు నాయక్ విజయం, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అభినందన Sat, Dec 13, 2025, 12:10 PM
ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. చివరికి? Sat, Dec 13, 2025, 12:03 PM
TGCET-2026: గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ Sat, Dec 13, 2025, 12:01 PM
సర్పంచ్ ఎన్నికల టెన్షన్.. మాజీ ఎంపీపీ కారుకు నిప్పు Sat, Dec 13, 2025, 12:01 PM