లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

byసూర్య | Mon, Mar 17, 2025, 04:37 PM

దేశీయ స్టాక్ మార్కెట సూచీలు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల సంకేతాలు రావడంతో ఎట్టకేలకు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 341 పాయింట్ల లాభంతో 74,169 వద్ద స్థిరపడగా నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో 22,509 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలీస్తే రూపాయి మారకం విలువ 86.80 వద్ద కొనసాగుతోంది.బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఉదయం 73,830.03 (క్రితం ముగింపు 73,828.91) పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. కాసేపటికే లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో 74,376.35 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 341.04 పాయింట్ల లాభంతో 74,169.95 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 111.55 పాయింట్ల లాభపడి 22,508.75 వద్ద స్థిరపడింది. మార్కెట్‌ ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువ 23 పైసలు బలపడి 86.82గా ఉంది.సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు, బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఐటీసీ, నెస్లే ఇండియా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 71.26 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3004 డాలర్ల ఎగువన ట్రేడవుతోంది.


Latest News
 

కను విందుగా పక్షుల సందడి Tue, Apr 29, 2025, 03:47 PM
బల్మూరులో గేదెల దొంగతనం Tue, Apr 29, 2025, 03:44 PM
విదేశాల్లో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి Tue, Apr 29, 2025, 03:31 PM
ప్రమాదవశాత్తు చిన్నారి మృతి Tue, Apr 29, 2025, 03:30 PM
రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆ గోడలు తొలగించాలని నిరసన Tue, Apr 29, 2025, 03:27 PM