తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణకు ఫోన్ చేశారు

byసూర్య | Mon, Mar 17, 2025, 04:29 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణకు ఫోన్ చేశారు. డీకే అరుణ నివాసంలోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడిన ఘటనపై మాట్లాడారు. ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఓ దుండగుడు చొరబడిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతుకుడిని గుర్తించేందుకు సీసీ ఫుటేజీని పరిశీలించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఎంపీ ఇంటికి చేరుకొని వివరాలను సేకరించారు. దుండగుడు ప్రవేశించిన ప్రాంతాలను పరిశీలించారు. డీకే అరుణకు కల్పించాల్సిన భద్రత పైనా డీసీపీ వివరాలు సేకరించారు.ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 56లోని ఎంపీ నివాసంలో ముసుగు ధరించిన ఆగంతుకుడు ఇంటి వెనుక నుంచి లోనికి ప్రవేశించాడు. సీసీ కెమెరా వైర్లను కత్తిరించి, దాదాపు గంట పాటు ఇంట్లో తిరిగాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.డీకే అరుణ కూతురు ఉదయం నిద్ర లేచేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది. వంట గది కిటికీ గ్రిల్ తొలగించడం గమనించారు. డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన ఆధారాలతో నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.


Latest News
 

స్టార్టప్‌ల కేంద్రంగానే టీ హబ్..వెనక్కి తగ్గిన రేవంత్ సర్కార్ Sat, Jan 24, 2026, 10:15 PM
‘ఆస్తుల కోసం విషపు రాతలు’: డిప్యూటీ సీఎం భట్టి Sat, Jan 24, 2026, 10:12 PM
ఉగ్యోగాల భర్తీపై కేంద్రమంత్రి కీలక ప్రకటన Sat, Jan 24, 2026, 10:04 PM
నాంపల్లి ఫర్నీచర్‌ షాపులో అగ్నిప్రమాదం.. భారీ నష్టం Sat, Jan 24, 2026, 09:43 PM
నాంపల్లిలో అగ్నిప్రమాదం,,,,భవనంలో చిక్కుకున్న ఆరుగురు Sat, Jan 24, 2026, 07:55 PM