అర్ధరాత్రి వేళ ప్రవేశించిన ఆగంతకుడు..బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం

byసూర్య | Sun, Mar 16, 2025, 05:50 PM

మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి.. ఆగంతకుడు ప్రవేశించాడు. జూబ్లీహిల్స్‌లోని డీకే అరుణ నివాసంలోకి శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించాడు. ఇంట్లోని కిచెన్, హాల్ ఇలా పరిసర ప్రాంతాలన్నీ కలియతిరిగాడు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి, కిచెన్ విండో తొలగించి ఆగంతకుడు లోనికి ప్రవేశించినట్లు తెలిసింది. గంటకుపైగా ఇంట్లో కలియతిరిగినట్లు తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే డీకే అరుణకు ఈ విషయాన్ని చేరవేశారు. డీకే అరుణ అప్రమత్తమై వెంటనే ఈ విషయాన్ని సిబ్బందికి తెలియజేయగా.. సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మరోవైపు ఆగంతకుడు ఇంట్లోకి చొరబడిన సమయంలో డీకే అరుణ అక్కడ లేనట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


Latest News
 

ఫోఫ్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు Tue, Apr 22, 2025, 04:24 PM
వేసవి దృష్ట్యా జరిగే దొంగతనాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ Tue, Apr 22, 2025, 04:19 PM
చలివేంద్రం ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 04:18 PM
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంత మంది పాసయ్యారంటే? Tue, Apr 22, 2025, 04:16 PM
ప్రతి వాహనంలో డాష్ కెమెరాల ఏర్పాటు: ఎస్పీ Tue, Apr 22, 2025, 03:47 PM