సీఎం రేవంత్ రెడ్డి జనగామ జిల్లా పర్యటన నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్

byసూర్య | Sun, Mar 16, 2025, 11:09 AM

స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గం లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటామని బీఆర్ఎస్  నేతలు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను హౌజ్ అరెస్ట్ చేశారు. రాజయ్య నివాసం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటుండటంతో పోలీసులు సైతం భారీగా మోహరించారు.కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో రూ. 800 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 50 వేల మందితో శివునిపల్లి వద్ద ప్రజాపాలన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్‌  శ్రేణులు హాజరుకానున్నారు. సీఎం సభ కోసం జనాన్ని తరలించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండల నేపథ్యంలో సభా ప్రాంగణంలో జర్మన్‌ టెక్నాలజీ టెంట్లను వేస్తున్నారు. సభకు వచ్చే వారి దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.


Latest News
 

KCR ప్రత్యేక శుభాకాంక్షలు: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆశీర్వాదాలు Sat, Feb 14, 2026, 11:55 PM
ఫార్ములా-ఈ రేస్ కేసు: ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం మంజూరు Sat, Feb 14, 2026, 09:47 PM
ఆ 4 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ డీలా.... ఒక్క వార్డు కూడా గెలవలేదు Sat, Feb 14, 2026, 09:22 PM
నామినేషన్ సమయంలోనే రూ.8 కోట్ల ఖర్చు.. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి Sat, Feb 14, 2026, 09:20 PM
మహబూబ్‌నగర్ నుంచి ఈ ప్రాంతాల మీదుగా,,,,తెలంగాణలో కొత్త 4 లైన్ హైవే Sat, Feb 14, 2026, 09:17 PM