నేడు అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత

byసూర్య | Sat, Mar 15, 2025, 07:53 PM

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో అత్యధికంగా కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో నేడు 42.4 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. హైదరాబాద్‌లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఏపీలో అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 5 రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.ఈ ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌ రెండో వారానికల్లా మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గాలిలో తేమ శాతం ఎక్కువగానే ఉండడం వల్ల ఉక్కపోత ఉండడంలేదు. అయితే ఎలినినో పరిస్థితుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో మున్ముందు ఎండ, వడగాలుల తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  


Latest News
 

ఫోఫ్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు Tue, Apr 22, 2025, 04:24 PM
వేసవి దృష్ట్యా జరిగే దొంగతనాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ Tue, Apr 22, 2025, 04:19 PM
చలివేంద్రం ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 04:18 PM
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంత మంది పాసయ్యారంటే? Tue, Apr 22, 2025, 04:16 PM
ప్రతి వాహనంలో డాష్ కెమెరాల ఏర్పాటు: ఎస్పీ Tue, Apr 22, 2025, 03:47 PM