వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు

byసూర్య | Sat, Mar 15, 2025, 02:39 PM

హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కిలాడీ లేడీ.. వరంగల్, మిల్స్ కాలనీ పరిధిలో నివాసముంటోందిడ్రగ్స్‌కు బానిసైన ఆ లేడీ.. తనతోపాటు డ్రగ్స్‌కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా మారి.. పాఠశాల బాలికలే లక్ష్యంగా ఈ కిలాడీ లేడీ వరంగల్లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహిస్తుంది పాఠశాలకు వెళ్లివచ్చే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో మాటలు కలిపి వారికి దగ్గరవుతుంది. చనువు పెంచుకుని, కలివిడిగా ఉన్నట్టు నటించి బాలికలను కిడ్నాప్ చేస్తోంది. ఆ బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి.. అప్పటికే తన, తన గ్యాంగ్ కు టచ్లో ఉన్న మానవ మృగాలకు వారిని అప్పగిస్తోందికిలాడీ లేడీకి డబ్బు ఇచ్చే మానవ మృగాలు.. బాలికలు మత్తులో ఉండగా వారిపై అత్యాచారాలు చేసేవారు. బాలికలు పూర్తిగా స్పృహలోకి రాగానే సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ వారిని ఎక్కడ నుంచి తీసుకొస్తుందో అక్కడే వదిలేసి వెళ్లిపోతారుఈ ముఠా దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తూ పలువురు బాలికల జీవితాలను నాశనం చేసింది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్కజిల్లాలకు కూడా తరలించినట్టు సమాచారంఅయితే వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోగా కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరాతీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదని, స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్టుగా తేలినట్లు సమాచారంఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్లు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ చేస్తోన్న అరాచకాలు తెలిశాయి. సదరు కిలాడీ లేడీని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం


Latest News
 

కుల వర్గ వ్యవస్థ నిర్ములన కోసం పోరాడిన వీరుడు పూలే Sat, Apr 11, 2026, 03:29 PM
శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం Sat, Apr 11, 2026, 02:37 PM
రేపటి నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో తీవ్ర వడగాల్పులు Sat, Apr 11, 2026, 02:35 PM
సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమీక్ష సమావేశం Sat, Apr 11, 2026, 01:56 PM
ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ చేతుల మీదుగా గ్రాండ్ గా "ఐ క్యాబ్స్" ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ ప్రారంభం Sat, Apr 11, 2026, 01:44 PM