![]() |
![]() |
byసూర్య | Sat, Mar 15, 2025, 02:36 PM
జగదీష్ రెడ్డి సభ గౌరవాన్ని కించపరచలేదు, రేవంత్ రెడ్డి లాగా బూతులు మాట్లాడలేదు.. ఎక్కడా చట్టవిరుద్ద చర్యలకు పాల్పడలేదు. కేవలం ఏకవచనంతో మాట్లాడారన్న అపవాదు తో సస్పెండ్ చేయడం వెనుక మీ భయం,ఆందోళన కనబడుతున్నది. ఆయన అలా మాట్లాడితే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడాల్సింది లేదా, క్షమాపణ కోరాల్సింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం,ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో ఉంటే కాంగ్రెస్ చేసిన మోసాలు,అన్యాయాలు అబద్దాలు అన్ని ప్రజలకు బహిర్గతమవుతాయనే భయంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. ఇది మీ చేతగానితనమే. మీరు సస్పెండ్ చేసినంత మాత్రాన బిఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నించడం ఆపదు.మీ కమీషన్ల గురించి ఎక్కడ ప్రజలకు చెబుతారోనన్న భయంతోనే సస్పెండ్ చేశారు.సస్పెన్షన్ ని వ్యతిరేకిస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును ఖండిస్తూన్నాం