సీఎం ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

byసూర్య | Sat, Mar 15, 2025, 02:20 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని బీఆర్‌ఎస్ పార్టీ బహిష్కరించింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై సీఎం సమాధానం ఇస్తుండగా బీఆర్‌ఎస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ చావును కోరుకున్న నాయకుడి ప్రసంగాన్ని తాము బహిష్కరిస్తున్నామని వాకౌట్‌కు ముందు ప్రకటించారు.బీఆర్ఎస్ పార్టీ స్ట్రెచర్‌ మీది నుంచి మార్చురీకే అని వ్యాఖ్యానించడం, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, 10 ఏండ్లు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిన పాలనాదక్షుడు అయిన కేసీఆర్ చావును కోరుకోవడం అంటే.. తెలంగాణకు కీడును కోరుకోవడమే అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా తాముసీఎం ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు.


Latest News
 

మిస్ వరల్డ్ - 2025 పోటీలపై సీఎం సమీక్ష సమావేశం Tue, Apr 29, 2025, 05:35 PM
రేపు 'లైట్స్ ఆఫ్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏఐఎంపీఎల్‌బీ Tue, Apr 29, 2025, 05:32 PM
దేశ భద్రతలో భాగంగా ప్రతి వ్యక్తి సైనికుడిలా ఉండాలి Tue, Apr 29, 2025, 05:30 PM
రేపు విజయవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ Tue, Apr 29, 2025, 05:20 PM
మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు, పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం Tue, Apr 29, 2025, 05:03 PM