తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒంటిపూట బడులు

byసూర్య | Fri, Mar 14, 2025, 09:08 PM

తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెలలోనే సగటు కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఆయా తెలుగు రాష్ట్రాల విద్యాశాఖలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రకటించాయి. ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో పాఠశాలల సమయంలో మార్పులు చేశాయి.తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. రేపటి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులను కొనసాగనున్నాయి.


 


Latest News
 

వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి అనుగుణంగా మౌలిక వసతులను కల్పిస్తాం : ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ Sat, Apr 18, 2026, 02:38 PM
మున్సిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స్ అక్రమాలు! Sat, Apr 18, 2026, 02:35 PM
బ్రిటన్ పార్లమెంట్ లో.... మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు అరుదైన గౌరవం Sat, Apr 18, 2026, 12:30 PM
జనగణనకు సిద్ధం కావాలి: అదనపు కలెక్టర్ Sat, Apr 18, 2026, 12:16 PM
వైన్స్ ఓనర్‌పై బీర్ బాటిల్‌తో దాడి Sat, Apr 18, 2026, 12:12 PM