ఎమ్మెల్సీ పోచంపల్లి ఫామ్ హౌస్ లో కోడిపందేలు కేసు విచారణకు హాజరైన పోచంపల్లి

byసూర్య | Fri, Mar 14, 2025, 07:14 PM

మొయినాబాద్ తొల్కట్ట గ్రామంలోని ఫామ్ హౌస్ లో కోడిపందేలు, కేసినో నిర్వహించిన వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు విచారించారు. సుమారు నాలుగున్నర గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. శ్రీనివాస్ రెడ్డి విచారణకు న్యాయవాదితో పాటు, తన ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకున్న వ్యక్తిని తీసుకువచ్చినప్పటికీ వారిని పోలీసులు లోపలకు అనుమతించలేదు. గత నెల 11న పోచంపల్లికి చెందిన ఫామ్ హౌస్ లో కోడిపందేలు, కేసినో నిర్వహిస్తున్నారనే సమాచారంలో పోలీసులు దాడి చేశారు. 61 మందిపై కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఈరోజు ఫామ్ హౌస్ యజమాని అయిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.


 


Latest News
 

మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు, పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం Tue, Apr 29, 2025, 05:03 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు Tue, Apr 29, 2025, 04:58 PM
దేశం పిలిస్తే ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమన్న ఓ మాజీ సైనికుడి వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి Tue, Apr 29, 2025, 04:53 PM
కేసీఆర్ సభ విజయవంతం కావడానికి కాంగ్రెస్ కారణమన్న జగ్గారెడ్డి Tue, Apr 29, 2025, 04:50 PM
కను విందుగా పక్షుల సందడి Tue, Apr 29, 2025, 03:47 PM