వాతావరణ అప్ డేట్స్

byసూర్య | Fri, Mar 14, 2025, 05:17 PM

తెలంగాణలో ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే 40 డిగ్రీల పైకి చేరుకున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపింది. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీలు నమోదవుతున్నట్లు వెల్లడించింది.ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. శనివారం మరో ఏడు జిల్లాల్లోను 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ఈ జిల్లాలకూ ఎల్లో హెచ్చరికలు అమల్లోకి వస్తాయని తెలిపింది.


Latest News
 

మిస్ వరల్డ్ - 2025 పోటీలపై సీఎం సమీక్ష సమావేశం Tue, Apr 29, 2025, 05:35 PM
రేపు 'లైట్స్ ఆఫ్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏఐఎంపీఎల్‌బీ Tue, Apr 29, 2025, 05:32 PM
దేశ భద్రతలో భాగంగా ప్రతి వ్యక్తి సైనికుడిలా ఉండాలి Tue, Apr 29, 2025, 05:30 PM
రేపు విజయవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ Tue, Apr 29, 2025, 05:20 PM
మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు, పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం Tue, Apr 29, 2025, 05:03 PM