కేంద్రం నుండి ఒక్క రూపాయి ఐనా తెచ్చావా?

byసూర్య | Fri, Mar 14, 2025, 05:09 PM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ముఖ్య‌మంత్రి 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నార‌ని, కానీ అక్క‌డి నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేద‌ని కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు. ఓటేసి మోసపోయాం అని జ‌నం చివాట్లు పెడుతుంటే ఢిల్లీలో చ‌క్క‌ర్లు కొడుతున్నావ్ అని ధ్వ‌జ‌మెత్తారు. నీళ్లు లేక పంట‌లు ఎండిపోతే క‌నీసం సాగునీళ్ల‌పై స‌మీక్ష కూడా చేయ‌డం లేద‌న్నారు. మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు... ఆడ లేక పాతగజ్జెలు అన్నట్లు హామీల అమ‌లు చేత‌గాక గాలి మాట‌లు, గ‌బ్బు కూత‌లు అని మాజీ మంత్రి మండిప‌డ్డారు.


Latest News
 

మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు, పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం Tue, Apr 29, 2025, 05:03 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు Tue, Apr 29, 2025, 04:58 PM
దేశం పిలిస్తే ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమన్న ఓ మాజీ సైనికుడి వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి Tue, Apr 29, 2025, 04:53 PM
కేసీఆర్ సభ విజయవంతం కావడానికి కాంగ్రెస్ కారణమన్న జగ్గారెడ్డి Tue, Apr 29, 2025, 04:50 PM
కను విందుగా పక్షుల సందడి Tue, Apr 29, 2025, 03:47 PM