విచారణకు హాజరైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

byసూర్య | Fri, Mar 14, 2025, 05:07 PM

మొయినాబాద్ ఫాంహౌస్‌లో కోడిపందేల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మొయినాబాద్ పోలీసులు ఆయనను విచారించారు. గత నెల 11వ తేదీన తోల్కట్ట గ్రామ పరిధిలోని శ్రీనివాస్ రెడ్డి ఫాంహౌస్‌పై ఎస్వోటీ, మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడి పందేలు ఆడుతున్న వారితో పాటు 64 మందిని అదుపులోకి తీసుకున్నారు.పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు ఇదివరకు నోటీసులు ఇచ్చారు. తన ఫాంహౌస్‌ను లీజుకు ఇచ్చానని పోలీసుల విచారణలో ఆయన తెలిపారు. లీజుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా పోలీసులకు అందజేశారు.అయితే, లీజు డాక్యుమెంట్లపై అనుమానాలు రావడంతో పోలీసులు ఆయనకు రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన విచారణకు హాజరయ్యారు.


Latest News
 

మిస్ వరల్డ్ - 2025 పోటీలపై సీఎం సమీక్ష సమావేశం Tue, Apr 29, 2025, 05:35 PM
రేపు 'లైట్స్ ఆఫ్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏఐఎంపీఎల్‌బీ Tue, Apr 29, 2025, 05:32 PM
దేశ భద్రతలో భాగంగా ప్రతి వ్యక్తి సైనికుడిలా ఉండాలి Tue, Apr 29, 2025, 05:30 PM
రేపు విజయవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్ Tue, Apr 29, 2025, 05:20 PM
మే 10న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలు అతిథులు, పోటీదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశం Tue, Apr 29, 2025, 05:03 PM